
అమరావతి, 07 అక్టోబర్ (హి.స.)
ఈ-పంట నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి నివేదిక అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులకు ఆదేశించారు.
ఆమదాలవలస మండలంలోని కలివరం గ్రామాన్ని ఆయన బుధవారం సందర్శించారు. అక్కడి వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియ, సంబంధిత రికార్డులను పరిశీలించి, సూపర్వైజరీ చెక్ నిర్వహించారు.
అదేవిధంగా పొలాల్లో పంట సాగు, సాగునీటి లభ్యత, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులను రైతులను అడిగి తెలుసుకున్నారు. సాగుకు నీరు పూర్తిస్థాయిలో అందడం లేదని రైతులు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నారాయణపురం కాలువ ద్వారా నిరంతరాయంగా సాగునీరు అందేలా, కాలువలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నీటి విడుదలను పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ