చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. మోదీతో భేటీలో కీలక ప్రాజెక్టులు, కరువు సాయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం నుంచి రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.
Chandrababu


అమరావతి , 07 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం నుంచి రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం మెట్రో రైలు, బీచ్ కారిడార్, నదుల అనుసంధానం, కరువు సాయం వంటి అంశాలు ఆయన చర్చల్లో ప్రధానంగా ఉండనున్నాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయం కోరాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడటం రాష్ట్రానికి ఆర్థిక భారాన్ని పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులు, గ్రామీణ ప్రాంతాలు, నీటి వనరులకు ఉపశమన చర్యలు చేపట్టేందుకు కేంద్ర సహాయం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande