మౌలిక వసతుల కల్పనకు చర్యలు: మంత్రి గడ్డం వివేక్
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం రూ.15 కోట్ల UIDF నిధులు మంజూరయ్యాయి.
Minister


పెద్దపల్లి, 07 అక్టోబర్ (హి.స.) మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని

24 వార్డుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం రూ.15 కోట్ల UIDF నిధులు మంజూరయ్యాయి.

ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి గడ్డం వివేక్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాయలింగుతో కలిసి 14వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సుమారు రూ.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అమృత్ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. మందమర్రి పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు సీసీ మరుగు కాలువల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

మందమర్రి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని మంత్రి గడ్డం వివేక్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande