
సంగారెడ్డి, 01 నవంబర్ (హి.స.)
హిందువుగా జీవించడం, హిందూ సంప్రదాయంలో జన్మించడం గొప్ప వరమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం భారతీ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం జరిగిన భగవద్గీత పారాయణ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. దేశ సరిహద్దులు, ఖండాలు దాటి విస్తరించిన మన సంస్కృతి, సంప్రదాయాలను మరువకూడదని సూచించారు. సనాతన ధర్మం వల్లే ప్రపంచానికి మేలు జరుగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతి రెడ్డి రామచంద్రాపురం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్, భారతీ నగర్ సీనియర్ నేతలు కృష్ణమూర్తి చారి, రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..