
హుజురాబాద్, 01 నవంబర్ (హి.స.)
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హుజూరాబాద్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా నేడు నిర్వహించిన కార్యక్రమంలో.. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. ఆన్లైన్లో తక్కువ ధరలకు వస్తువులు, బహుమతులు, ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో వచ్చే మోసపూరిత ప్రకటనలను నమ్మి డబ్బులు పంపవద్దని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు