విశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
విశాఖపట్నంలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (పార్ట్నర్షిప్ సమిట్) ప్రారంభం కానుంది.
విశాఖలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు


విశాఖపట్నం , 11 నవంబర్ (హి.స.)

విశాఖపట్నంలో రేపటి నుంచి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (పార్ట్నర్షిప్ సమిట్) ప్రారంభం కానుంది. ఈ నెల 12, 13 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు 58 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు సహా మొత్తం 3,800 మంది పాల్గొననున్నట్లు టీడీపీ నేతలు వెల్లడించారు.

ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం రూ.11 లక్షల కోట్ల విలువైన 160 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. విశాఖలో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడం నగరానికి గర్వకారణమని అన్నారు.

పెట్టుబడుల ఆకర్షణకు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏపీ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande