స్పైసీ ఫుడ్.. స్పీడీ అప్రూవల్స్.. ఇదే ఆంధ్రా స్టైల్: మంత్రి నారా లోకేశ్
విశాఖపట్నంలో జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులకు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శైలిలో స్వాగతం పలికారు.
Lokesh


విశాఖపట్నం, 11 నవంబర్ (హి.స.)

విశాఖపట్నంలో జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులకు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శైలిలో స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ఆతిథ్య సంప్రదాయాన్ని, రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రభుత్వం కల్పిస్తున్న అనుకూల వాతావరణాన్ని సరదాగా వివరిస్తూ ఆకట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్లో ఘాటైన ఆహారానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెబుతూ లోకేశ్ చమత్కరించారు. ఇక్కడి మెనూలో నాన్ స్పైసీ ఫుడ్ అనేది ప్రత్యేకంగా కోరుకోవాల్సిన ఆప్షన్ కాదంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఆహారంలోనే కాదు, పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ వేగంగా వ్యవహరిస్తుందని తన సందేశం ద్వారా వివరించారు.

'స్పైసీ ఫుడ్.. స్పీడీ అప్రూవల్స్' అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఘాటైన వంటకాలు, పెట్టుబడులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత అని చెప్పేలా ఈ సందేశాన్ని రూపొందించారు. 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్లోని అవకాశాలను పరిచయం చేయడంతో పాటు, పెట్టుబడులకు రాష్ట్రం సిద్ధంగా ఉందనే సంకేతాన్ని లోకేశ్ తనదైన శైలిలో అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande