
హైదరాబాద్ , 02 నవంబర్ (హి.స.)
హైదరాబాద్లో నిర్వహిస్తున్న పాదయాత్ర సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్లో తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ అనే నినాదాన్ని వినిపించారు.
వరుస ఎన్నికల్లో ఎదురవుతున్న పరాజయాలతో కాంగ్రెస్ పార్టీ నిరాశకు గురైందని అమిత్ షా విమర్శించారు. ప్రజల మద్దతుతో రాజకీయంగా ముందుకు సాగాల్సిన పార్టీ, ఇప్పుడు అరాచక పద్ధతుల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అధికారం కోసం ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు.
కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ప్రజలు గుర్తించాలని, వాటిని సమర్థంగా తిప్పికొట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా హైదరాబాద్లో పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలన్న సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని అమిత్ షా తన ట్వీట్లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్