
హైదరాబాద్ , 02 నవంబర్ (హి.స.)
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా సినీ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు . కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సినీ నటులు చిరంజీవి, రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిసుకున్నారు. బేగంపేట్ కాకతీయ హోటల్లో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో తాజా పరిస్థితుల గురించి వారి చర్చించారు. అంతకు ముందు అమిత్ షాను మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరావు కూడా కలిశారు.
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్