రాహుల్ గాంధీకి ప్రధాని పదవిపై ఉన్న ఆసక్తి ప్రజా సంక్షేమంపై లేదు.. కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 02 నవంబర్ (హి.స.)

కాంగ్రెస్ పార్టీ దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశీ శక్తుల సహకారంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసి, అధికారాన్ని కూల్చివేయాలని చూస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో అశాంతి నెలకొల్పడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని, రాహుల్ గాంధీకి ప్రధాని పదవిపై ఉన్న ఆసక్తి తప్ప ప్రజా సంక్షేమంపై శ్రద్ధ లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ వ్యవహారశైలిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని అన్నారు. ఇందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాదయాత్రలు నిర్వహించి ప్రజలకు కాంగ్రెస్ తీరును వివరిస్తామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande