నేడు ఎస్ఈసీని కలవనున్న వైసీపీ నేతలు.. రీపోలింగ్కు డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అధికారులను కలవనున్నారు.
YSRCP


అమరావతి , 02 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అధికారులను కలవనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

ఎన్నికల ప్రక్రియలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలను మరోసారి నిర్వహించాలని, రీపోలింగ్కు అవకాశం కల్పించాలని ఎస్ఈసీని కోరనున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో జరిగిన దాడులు, అడ్డంకులు, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేయనున్నారు.

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కూడా కోరనున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు విజ్ఞప్తి చేయనున్నారు. ఎస్ఈసీతో భేటీ అనంతరం నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande