సింహాచలం ఆలయానికి జాతీయ స్థాయి గుర్తింపు.. ‘ఈట్ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’ సర్టిఫికెట్ అందజేత
సింహాచలం ఆలయానికి జాతీయ స్థాయి గుర్తింపు.. ‘ఈట్ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’ సర్టిఫికెట్ అందజేత
simhachalam


విశాఖపట్నం/సింహాచలం: , 24 నవంబర్ (హి.స.)

వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న సింహాచలం దేవస్థానానికి అరుదైన జాతీయ గౌరవం దక్కింది. భక్తులకు శుభ్రమైన పరిసరాల్లో నాణ్యమైన, సురక్షితమైన అన్నప్రసాదాలను అందిస్తున్న నేపథ్యంలో భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) నుంచి ‘ఈట్ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’ ధ్రువీకరణ పత్రాన్ని ఆలయం దక్కించుకుంది.

మంగళవారం (నవంబర్ 24) ఆహార భద్రతా విభాగం అధికారులు దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) జల్లేపల్లి వెంకటరావుకు ఈ సర్టిఫికెట్‌ను అధికారికంగా అందజేశారు. అన్నప్రసాదాల తయారీలో పాటిస్తున్న నిబంధనలు, వంటశాలల పరిశుభ్రత, వినియోగిస్తున్న ముడి సరుకుల నాణ్యత, తాగునీటి భద్రత వంటి అంశాలను ఒక స్వతంత్ర ఆడిట్ సంస్థ క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అన్ని ప్రమాణాలు సంతృప్తికరంగా ఉండటంతో రెండేళ్ల పాటు చెల్లుబాటు అయ్యే ఈ గుర్తింపును మంజూరు చేశారు.

ఈ సందర్భంగా ఈవో జల్లేపల్లి వెంకటరావు మాట్లాడుతూ.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని, భవిష్యత్తులోనూ మరింత నాణ్యతతో, రుచికరంగా, సురక్షితంగా అన్నప్రసాద సేవలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande