సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అచ్చంపేట పట్టణంలో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి
కలెక్టర్


అచ్చంపేట, 24 నవంబర్ (హి.స.)

ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అచ్చంపేట పట్టణంలో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. మంగళవారం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, సబ్ కలెక్టర్ సలోని చాబ్రా కలిసి సభా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభా ప్రాంగణం, వేదిక, ప్రజల రాకపోకల మార్గాలు, తాగునీరు, పారిశుద్ధ్య వసతులను అధికారులు పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రత్యేక పార్కింగ్, పటిష్ట భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం లింగాల రోడ్డులోని ఆర్టీసీ గ్రౌండ్ లో హెలిప్యాడ్ ఏర్పాట్లను చూశారు. అక్కడి నుంచి సీఎం పాదయాత్రగా సభా ప్రాంగణానికి వచ్చే మార్గాన్ని తనిఖీ చేశారు. అంబేద్కర్ కూడలిలో విగ్రహానికి నివాళులర్పించే ప్రాంతంలో చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటన ఏర్పాట్లను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande