మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల ధర్నా శిబిరాన్ని సందర్శించిన హరీష్ రావు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంగళ్ పల్లి వద్ద వసతులు లేవంటూ గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల ధర్నా శిబిరాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సందర్శించారు.
Harish Rao


హైదరాబాద్, 04 నవంబర్ (హి.స.)

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంగళ్ పల్లి వద్ద వసతులు లేవంటూ గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల ధర్నా శిబిరాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సందర్శించారు.

ఆయన వెంట మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి క్యామ మల్లేశ్ తదితరులు ఉన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి నుంచే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డీఎంఈ వాణీదేవితో ఫోన్ లో మాట్లాడి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న ఈ మెడికల్ కాలేజీ పరిస్థితి పశువుల కొట్టం కంటే దారుణంగా ఉందని, కనీసం తాగునీరు, వాష్ రూములు, ల్యాబ్స్, లైబ్రరీ, హాస్టల్ వసతులు కూడా లేవని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 26 నెలలుగా భవన అద్దెతో పాటు కరెంటు, వాటర్ బిల్లులు చెల్లించకపోవడంతో ఓనర్ భవనాన్ని పట్టించుకోవడం మానేశాడని ఆరోపించారు. కళాశాల భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ కూడా లేవని, స్వయంగా ప్రిన్సిపాల్ లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande