కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం రూ.1.10 కోట్లు పరిహారం
విధి నిర్వహణలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళిక కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ముందుకు వచ్చాయి. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో ఉన్న ప్రవళిక పార్థివదేహానికి రవాణా శాఖ మంత
Minister


హైదరాబాద్, 04 నవంబర్ (హి.స.)

విధి నిర్వహణలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళిక కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ముందుకు వచ్చాయి. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో ఉన్న ప్రవళిక పార్థివదేహానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ప్రవళిక తల్లిని ఓదార్చి ప్రభుత్వం, ఆర్టీసీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రవళిక కుటుంబానికి అందించే సహాయాన్ని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం తరపున రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా, ఆర్టీసీ ప్రమాద బీమా ఒప్పందం ప్రకారం బ్యాంకు ద్వారా రూ. 1 కోటి పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రవళిక మృతి ఆర్టీసీ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఆమెను కాపాడలేకపోయామని అన్నారు. ఈ ఘటనలో నిందితులపై ఇప్పటివరకు ఉన్న హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చి కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande