సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసుల అవగాహన
సైబర్ జాగృత దినోత్సవం సందర్భంగా బుధవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు సైబర్ నేరాలపై స్థానిక పోలీసులు అవగాహన కల్పించారు.
Police


సిద్దిపేట, 04 నవంబర్ (హి.స.)

సైబర్ జాగృత దినోత్సవం సందర్భంగా బుధవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు సైబర్ నేరాలపై స్థానిక పోలీసులు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆకర్షణీయమైన ఆన్ లైన్ ప్రకటనలు, అధిక లాభాలు వస్తాయని చెప్పే నకిలీ పెట్టుబడి పథకాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. క్రెడిట్, డెబిట్ కార్డుల ఓటీపీ, సీవీవీ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు.

అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మీ డబ్బు, మీ క్లిక్, మీ ఎంపిక అనే నినాదాన్ని గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన పెంచుకోవాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande