ప్రకృతితో మమేకమైన జీవనశైలి ఆదివాసీల ప్రత్యేకత....ఆదిలాబాద్ ఎంపీ నగేష్
ఆదివాసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గెడెం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
Mp


ఆదిలాబాద్, 05 నవంబర్ (హి.స.)

ఆదివాసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గెడెం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

దండారి ఉత్సవాల్లో భాగంగా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామంలోని శ్రీ పద్మల్పురి కాకో ఆలయంలో గురువారం నిర్వహించిన దండారి దర్బార్కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆదివాసీలు తమ సంప్రదాయ వాయిద్యాలతో అతిథులకు ఘన స్వాగతం పలికి ఆలయం వరకు తోడ్కొని వెళ్లారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గిరిజనులు ప్రదర్శించిన గుస్సాడి నృత్యాలు అతిథులను ఎంతగానో అలరించాయి.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ చుట్టూ దట్టమైన అడవి, కొండకోనల మధ్య నివాసం, ప్రకృతితో మమేకమైన జీవనశైలి ఆదివాసీల ప్రత్యేకత అని పేర్కొన్నారు. వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానం ప్రకృతికి దగ్గరగా ఉంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. తమ సంస్కృతిని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఆదివాసీలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు. వారి జీవనశైలి ప్రకృతిని గౌరవించడం, సమాజాన్ని ప్రేమించడం నేర్పుతుందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande