అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దు.. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ నగరంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ భూమిపూజ నిర్వహించారు.
Mla


నిజామాబాద్, 05 నవంబర్ (హి.స.)

నిజామాబాద్ నగరంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ భూమిపూజ నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి డివిజన్కు రూ.20 లక్షల చొప్పున ఇటీవల కార్పొరేషన్ కౌన్సిల్లో నిధులు మంజూరు చేశామన్నారు. కొన్ని డివిజన్లలో ఇప్పటికే రూ.కోటి విలువైన పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.

అమృత్ 2.0 కింద జరుగుతున్న యూజీడీ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఎల్నినో కారణంగా ముందు ముందు నీటి ఇబ్బందులు రావొచ్చని, అందుకే ప్రజలు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.

ఖిల్లా రామాలయం అభివృద్ధిలో భాగంగా రోప్వే నిర్మించనున్నట్లు తెలిపారు. దీనిపై ఇటీవలే అధికారులు, కంపెనీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande