పిట్లంపల్లిలో పోలింగ్ బూత్కు వైసీపీ నాయకుల తాళం.. ఉద్రిక్తత
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పిట్లంపల్లిలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
Vote


అనంతపురం జిల్లా, 05 నవంబర్ (హి.స.)

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పిట్లంపల్లిలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయనే కారణంతో వైసీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి.

అనంతరం వైసీపీ నాయకులు పోలింగ్ బూత్కు తాళం వేయడంతో ఓటింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలింగ్ కేంద్రం వద్ద నెలకొన్న పరిస్థితులతో ఓటర్లు, ఎన్నికల సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఎన్నికల అధికారులు ఎలా స్పందిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande