
హైదరాబాద్, 04 ఫిబ్రవరి (హి.స.)*తెలంగాణ సోషల్ జస్టిస్ డే సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు - మంత్రి పొన్నం ప్రభాకర్*
తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 4 ఎస్సీ వర్గీకరణ కి సంబంధించి , బీసీ కుల గణన కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకొని ఆమోదించుకుని ఆయా వర్గాలకు న్యాయం జరగాలని నిర్ణయం తీసుకున్న రోజు
ఈరోజు ను తెలంగాణ సోషల్ జస్టిస్ డే గా నిర్వహిస్తుంది.. కోర్టుల వల్ల కొన్ని నిర్ణయాల అమలు ఆగి ఉండవచ్చు
రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలహీన వర్గాలకు న్యాయం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది..
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది..
అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతుంది..సోషల్ జస్టిస్ డే సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు..
ఆయా వర్గాల హక్కుల కోసం మనమంతా కలిసి సాధించుకుందాం..
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు