
కందకుర్తి , 11 ఏప్రిల్ (హి.స.)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకుల స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో నూతనంగా నిర్మించిన శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని శనివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మెహన్ భాగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ స్ఫూర్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్యాలరీని మోహన్ భాగవత్ వీక్షించారు. అదేవిధంగా డాక్టర్జీ జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రమాలికనుని కూడా మోహన్ భాగవత్ వీక్షించారు. ఈ ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్జీ జీవిత చరిత్రను క్షుణ్ణంగా వుంచారు.అలాగే కేశవమూర్తి, రుక్మిణీ సమేత విఠలేశ్వర ఆలయంతో పాటు స్కంధ ఆలయాలను కూడా ఆయన సందర్శించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi