
ఎమ్మిగనూరు: , 16 ఏప్రిల్ (హి.స.)
కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరులోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, బాలిక ఉన్నారు.
కర్ణాటకలోని చిక్మంగళూరుకు చెందిన భక్తులు మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంపై ఏపీ మంత్రులు భరత్, జనార్దన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ