నెల్లూరులో రూ.17 కోట్ల అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలతో శంకుస్థాపనలు
నెల్లూరులో రూ.17 కోట్ల అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలతో శంకుస్థాపనలు
17-crore-development-works-launched-in-nellore-rural-kotamredd


నెల్లూరు, 15 మే (హి.స.) నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలతో శంకుస్థాపనలు చేయించారు కూటమి నేతలు. రూ.17 కోట్లతో చేపట్టే 168 అభివృద్ధి పనులకు ఎక్కడికక్కడ ప్రజలు శంకుస్థాపనలు చేశారు.

ఈరోజు(శుక్రవారం) ఉదయం గాదం రోశయ్యనగర్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత గిరిధర్ రెడ్డి, కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూరల్లో రూ.700 కోట్లతో అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు.

ప్రస్తుతం శంకుస్థాపనలు చేసిన పనులను 60 రోజుల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వాటిని ప్రజలతోనే ప్రారంభోత్సవాలు చేయిస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు సూచించే పొదుపు ప్రణాళికలు అందరూ పాటించాలని సూచించారు. అందుకే ఎలక్ట్రిక్ బైక్పై ఒంటరిగా వచ్చినట్లు తెలిపారు. ర్యాలీలు, సెక్యురిటీ, కాన్వాయ్ రద్దు చేశామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande