చిలుకూరు బాలాజీ ఆలయంపై యూఎస్ సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు: మండిపడ్డ అర్చకులు, భారతీయ సంఘాలు
చిలుకూరు బాలాజీ ఆలయంపై యూఎస్ సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు: మండిపడ్డ అర్చకులు, భారతీయ సంఘాలు
చిలుకూరు


హైదరాబాద్, 15 మే (హి.స.)

అమెరికా వీసా విధానంపై తీవ్ర

విమర్శలు గుప్పించే క్రమంలో యూఎస్ రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిత్ హైదరాబాద్లోని

ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని 'వీసా కార్టెల్' (వీసా మాఫియా కూటమి) గా

అభివర్ణించడం తీవ్ర వివాదానికి దారితీసింది. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రానికి

ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన H-1B, L1 వీసా వ్యవస్థను భారతీయులు దుర్వినియోగం చేస్తున్నారంటూ

సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. అమెరికా ఐటీ కంపెనీలు స్థానిక

అమెరికన్ కార్మికులను తొలగించి, తక్కువ వేతనాలకే లభించే విదేశీ ఉద్యోగులను ఈ వీసాల ద్వారా

నియమించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే అమెరికా ఉద్యోగ వ్యవస్థను ఒక

పద్ధతి ప్రకారం మోసం చేస్తున్నారని చెబుతూ, ఈ కార్టెల్కు హైదరాబాద్లో ఒక 'వీసా ఆలయం' (చిలుకూరు బాలాజీ ఆలయం) కూడా

ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీసాల కోసం భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు

చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఈ వివాదాస్పద వ్యాఖ్యలపైచిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన

అర్చకులు సి.ఎస్. రంగరాజన్తీవ్రంగా స్పందించారు. భక్తుల

పవిత్రమైన నమ్మకాన్ని, ప్రార్థనలను ఒక 'మాఫియా' లేదా 'మోసం'గా చిత్రీకరించడం అర్చకులను, కోట్లాది మంది హిందూ భక్తులను

తీవ్రంగా గాయపరిచిందని ఆయన అన్నారు. భక్తులు తమ కష్టపడే తత్వానికి దైవబలం తోడవాలని

భగవంతుడిని వేడుకుంటారే తప్ప, ఇక్కడ ఎలాంటి అక్రమ వీసా నెట్వర్క్ నడవట్లేదని ఆయన స్పష్టం

చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమెరికా సెనేటర్ ఇలాంటి అజ్ఞానపు వ్యాఖ్యలు

చేయడం సరికాదని మండిపడ్డారు.

భారతీయ సమాజానికి క్షమాపణలు

చెప్పాలి

మరోవైపు, అమెరికాలోనిఇండో-అమెరికన్ కమ్యూనిటీలు

మరియు భారతీయ సంఘాలుకూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. సెనేటర్ ఎరిక్

ష్మిత్ కేవలం రాజకీయ లబ్ధి కోసం, అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను

కప్పిపుచ్చుకోవడానికి భారతీయుల సంస్కృతిని, వారి మత విశ్వాసాలను లక్ష్యంగా

చేసుకుంటున్నారని వారు ఆరోపించారు. H-1B ఉద్యోగులు తమ నైపుణ్యాల ద్వారా

అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల కొద్దీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నారని

గుర్తుచేశారు. పవిత్రమైన ఆలయాన్ని కార్టెల్గా అభివర్ణించినందుకు గానూ సెనేటర్

ఎరిక్ ష్మిత్ తక్షణమే భక్తులకు, భారతీయ సమాజానికి క్షమాపణలు చెప్పాలని ఇటు తెలుగు రాష్ట్రాల

ఐటీ నిపుణులు, అటు అమెరికాలోని భారతీయ సంఘాలు గట్టిగా డిమాండ్

చేస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande