
పుట్టపర్తి, 15 మే (హి.స.) రాయలసీమ ఇకపై రక్షణ సీమగా మారనుంది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇవాళ అడ్వాన్సుడ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. రూ.15,803 కోట్ల ఖర్చుతో నిర్మితం కాబోతున్న ఈ ప్రాజెక్టుతో దాదాపు 7500 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. దీనికి అనుబంధంగా వచ్చే ఇతర యూనిట్ల తో లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని సర్కార్ అంచనా వేస్తోంది.
అడ్వాన్సుడ్ మీడియం కంబాట్ ప్రాజెక్టుకు పుట్టపర్తిలో ఇవాళ పునాది రాయి పడనుంది. దీన్ని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, డీఆర్డీఓ సంయుక్తంగా చేపడుతున్నాయి. రూ15,803 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం 650 ఎకరాలు సేకరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇండియా మొట్టమొదటి 5వ తరం స్టైల్త్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లను అభివృద్ధి చేయనున్నారు. స్టైల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్, సూపర్ క్రూయిజ్ లాంటి కెపాసిటీలు ఈ యుద్ధ విమానాల ప్రత్యేకత అని చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV