పుట్టపర్తిలో యుద్ధ విమానాల టెస్టింగ్ సెంటర్కు భూమిపూజ
పుట్టపర్తి, 15 మే (హి.స.)రాయలసీమ రత్నాల గని నుంచి రక్షణ కవచంగా రూపాంతరం చెందుతోంది. భారత అమ్ములపొదిలో సరికొత్త అస్త్రంగా అవతరించనుంది. పుట్టపర్తి వేదికగా 15 వేల 803 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ''AMCA'' ఐదో తరం యుద్ధ విమానాల ప్రాజెక్టు ఏపీ పా
groundbreaking-ceremony-for-fighter-jet-testing-center-in-puttaparth


పుట్టపర్తి, 15 మే (హి.స.)రాయలసీమ రత్నాల గని నుంచి రక్షణ కవచంగా రూపాంతరం చెందుతోంది. భారత అమ్ములపొదిలో సరికొత్త అస్త్రంగా అవతరించనుంది. పుట్టపర్తి వేదికగా 15 వేల 803 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న 'AMCA' ఐదో తరం యుద్ధ విమానాల ప్రాజెక్టు ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలవనుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కలిసి దీనికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా యుద్ధవిమానాల టెస్టింగ్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుకు పుట్టపర్తిలో పునాదిరాయి పడుతోంది. అమెరికా ఎఫ్ 35, రష్యా ఎస్ యూ 57 విమానాలకు పోటీగా ఇక్కడ యుద్ధవిమానాలు తయారు చేయనున్నారు. అంతేకాకుండా మెరుగైన టెక్నాలజీతో ఏఐ ఆధారితంగా పనిచేసే ఫైటర్ జెట్స్ ఇక్కడ తయారు చేయబోతునట్టు తెలుస్తోంది. రూ.15,800 కోట్లతో ఈ ఏఎంసీఏ ప్రాజెక్టును చేపడుతున్నారు. 550 ఎకరాల్లో చేపడుతున్న ఎరో కాంప్లెక్స్ తో 1700 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

వందలాది మంది ఇంజనీర్లు, టక్నీషియన్లు ఇక్కడ పనిచేయనున్నారు. ఎరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ, రక్షణశాఖ ఆధ్వర్యంలో దీని నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టును కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఢిఫెన్స్ , డ్రోన్స్ రంగాలకు సంబంధించి మరో 12 ప్రాజెక్టులకు సైతం శంకుస్థాపన చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పుట్టపర్తి ఎయిర్ స్ట్రిప్ రన్ వేను సైతం 10 వేల అడుగులకు విస్తరించబోతున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా అధునాతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్స్, వాతావరణ సూచన కేంద్రాలు, భద్రతా సదుపుయాలు లాంటి ఆధునిక సదుపాయాలు కల్పించబోతున్నట్టు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande