
నంద్యాల, 15 మే (హి.స.)ఆళ్లగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ రోజు శుక్రవారం పోలీస్ సర్కిల్ పరిధిలోని జిల్లా హోంగార్డులకు మాక్ డ్రిల్ నిర్వహించారు. నంద్యాల హోంగార్డ్స్ విభాగం హెచ్సీ రవీంద్ర ఆధ్వర్యంలో దేహదారుఢ్య శిక్షణ ఇచ్చారు. శారీరక దృఢత్వం పెంపొందించే వ్యాయామాలు నిర్వహించారు. విధి నిర్వహణలో నైపుణ్యం పెంపొందించేందుకు తరచూ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు చేపడతామని అధికారులు తెలిపారు.
మాక్ డ్రిల్ అనేది భద్రతా దళాలు అదేవిధంగా ప్రభుత్వ విభాగాలు ప్రజలను సన్నద్ధం చేసేందుకు అత్యవసర సమయాలు ఎలా స్పందించాలి అనే విషయాలను వారికి అర్థమయ్యేలా తెలియజేస్తుంది. . ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో ఎలా వ్యవహరించాలి అనే అంశం పైన మాక్ డ్రిల్ లో ముందుగానే తెలియజేస్తారు. ముఖ్యంగా యుద్ధం వంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు పౌరులకు ప్రాణ నష్టం కలగకుండా ఎవరికి వారు ప్రభుత్వం తెలిపిన సురక్షితమైన తగు జాగ్రత్తలను తీసుకున్నట్లయితే సంక్షోభ సమయంలో కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. మనదేశంలో 1971లో తొలిసారిగా మాక్ డ్రిల్ నిర్వహించారు. అప్పట్లో పాకిస్తాన్ పైన భారత్ యుద్ధానికి దిగినప్పుడు తొలిసారిగా ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరిగింది. సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత మరోసారి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. . ఇందులో భాగంగా మొత్తం దేశంలోని 259 లొకేషన్ లో మాక్ డ్రిల్ నిర్వహించునున్నారు. గతంలో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కేవలం పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. . అయితే ఈసారి తొలిసారిగా దేశమంతా మరోసారి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్నారు. ఆలయం వద్ద ఏదైనా దాడి జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, యాత్రికులను ఏవిధంగా కాపాడాలన్న దానిపై మాక్డ్రిల్ నిర్వహించామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV