
తిరుపతి, 15 మే (హి.స.)నిన్న గురువారం నుంచి బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు మూగబోయాయి.ఆదివారం నుంచి అధిక జ్యేష్ట మాసం రానుండడంతో 2026 మే 17 నుంచి జూన్ 15-18 వరకు (దాదాపు నెల రోజుల పాటు) అధిక జ్యేష్ఠ మాసం (మూఢమి) రానున్నందున, వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు బ్రేక్ పడింది.
కల్యాణ మండపాలు బోసిపోయాయి. పురోహితులు పంచాంగాలు చుట్టేశారు. షామియానాలు, అలంకరణ సామగ్రిని యజమానులు అటకెక్కించేశారు. వంటవాళ్ళు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఫిబ్రవరి నుంచి మే 13 వరకూ తెలుగు లోగిళ్ళను వివిధ రకాల శుభకార్యాలతో కళకళలాడించిన ముహూర్తాలు నెల రోజల పైబడి సెలవు తీసుకుంటున్నాయి. గురువారం నుంచి మూడు రోజులు ముహూర్తాలు లేక ఎలాంటి శుభకార్యాలకు అవకాశం లేకుండా పోయింది.
ఆదివారం నుంచి అధిక జ్యేష్ట మాసం రానుండడంతో జూన్ 20 వరకూ మంచి రోజులు లేవని పురోహితులు చెపుతున్నారు.జూన్లో చివరి 8 రోజులు మంచి ముహూర్తాలున్నాయని పండితులు వివరిస్తున్నారు. జూలైలో మరో నాలుగు రోజులు మాత్రమే ముహూర్తాలున్నాయిని ఆ తరువాత చతుర్మాసం తదితర కారణాలతో ఆగస్టులో 11 రోజులు, సెప్టెంబరులో 4, అక్టోబరులో మరో 4 రోజులు మాత్రం ముహూర్తాలున్నా చతుర్మాసం అడ్డొస్తోందని పురోహితులు అంటున్నారు. ఆ తరువాత నవంబరులో కార్తీక మాసం కారణంగా 11 రోజులు, డిసెంబరులో మరో 14 రోజుల్లో కూడా అనువైన ముహూర్తాలున్నాయంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV