బ్రిడ్జి కి ఏకలవ్యుని పేరు పెట్టాలని మంత్రి లోకేష్ కు వినతి
బ్రిడ్జి కి ఏకలవ్యుని పేరు పెట్టాలని మంత్రి లోకేష్ కు వినతి
లోకేష్


పుట్టపర్తి, 15 మే (హి.స.)అనంతపురం టవర్ క్లాక్ వద్ద నిర్మించిన నూతన బ్రిడ్జికి గిరిజనుల ఆరాధ్య దైవం, త్యాగనిరతికి ప్రతీక అయిన ఏకలవ్యుని పేరు పెట్టాలనే డిమాండ్ గిరిజన సంఘాల నుండి బలంగా వినిపిస్తోంది.

ఏకలవ్యుడు గిరిజన సమాజానికి ఆత్మగౌరవ ప్రతీక. గురుభక్తి, అచంచలమైన పట్టుదల, విలువిద్యలో అత్యున్నత నైపుణ్యం కలిగిన ఏకలవ్యుని స్మరణార్థం నూతన వంతెనకు ఆయన పేరు పెట్టడం సముచితమని గిరిజనులు భావిస్తున్నారు.

నూతన బ్రిడ్జికి గిరిజనుల ఆరాధ్య దైవం ఏకలవ్యుని పేరు పెట్టాలని టీడీపీ ఎస్టీ సెల్ నగర అధ్యక్షులు మనోహర్ గుజ్జుల, మంత్రి నారా లోకేష్ను కోరారు. ఈ రోజు శుక్రవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటనకు వచ్చిన మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మనోహర్, ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు (వంతెనలు, రహదారులు) గిరిజన వీరుల పేర్లు పెట్టడం ద్వారా, ఆయా వర్గాల ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంటుంది. గతంలో కూడా పలు ప్రభుత్వాలు గిరిజన నాయకులు, దైవాల పేర్లను మౌలిక సదుపాయాలకు పెట్టడం ద్వారా వారిని గౌరవించాయి. కాబట్టి, నూతన బ్రిడ్జికి ఏకలవ్యుని పేరు పెట్టాలనే అభ్యర్థనపై అధికారులు సానుకూలంగా స్పందించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి అని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande