
జోర్హాట్ , 13 జూన్ (హి.స.)
అస్సాంలోని
జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కు చెందిన AN-32 రవాణా విమానం ల్యాండింగ్
సమయంలో ప్రమాదానికి గురైంది.శనివారం ఉదయం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో రన్వేపై
ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే
విమానంలో భారీగా మంటలు చెలరేగడంతో రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని
మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పైలట్ మరణించి ఉండవచ్చని
ప్రాథమిక నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రక్షణ శాఖ పిఆర్ఓ లెఫ్టినెంట్
కల్నల్ ఎం. రావత్ ఈ విమాన ప్రమాదాన్ని ధృవీకరించారు. ప్రమాదానికి గల కారణాలు,
పూర్తి స్థాయి ప్రాణ నష్టంపై ఎయిర్ ఫోర్స్
అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi