సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ.కోసం గాలింపు
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ.కోసం గాలింపు
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ.కోసం గాలింపు


అమరావతి, 20 ఆగస్టు (హి.స.)

: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ, మెరైన్ పోలీసులు, కోస్ట్గార్డ్ సమన్వయంతో విస్తృతంగా గాలింపు చేపట్టాలని సూచించారు. ఈనెల 16న 8 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా.. సముద్ర తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల దూరంలో బోటు ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో అప్పన్న గల్లంతయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన మత్స్యకారుల పరిస్థితిపైనా అనిత ఆరా తీశారు. గల్లంతైన అప్పన్నను క్షేమంగా గుర్తించి కుటుంబసభ్యుల వద్దకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలని ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని హోంమంత్రి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande