నల్లమలలో ఆరుగురు భక్తులు గల్లంతు.. గాలింపు ముమ్మరం
నల్లమలలో ఆరుగురు భక్తులు గల్లంతు.. గాలింపు ముమ్మరం
missing


నంద్యాల, ఆగస్టు 20 (హి.స.): ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో అహోబిలం సమీప నల్లమల అటవీ ప్రాంతంలో ఆరుగురు భక్తులు గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.

ప్రొద్దుటూరుకు చెందిన పది మంది భక్తులు అహోబిలంలోని పావన నరసింహస్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా వారిలో ఆరుగురు దారి తప్పి అడవిలో గల్లంతైనట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి గల్లంతైన భక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గల్లంతైన వారంతా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినవారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

నల్లమల అటవీ ప్రాంతంలో భక్తుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Indrani Sarkar


 rajesh pande