ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక వైద్య శిబిరాలు
ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక వైద్య శిబిరాలు
ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక వైద్య శిబిరాలు

ఏలూరు: , 26 ఆగస్టు (హి.స.)

ఏలూరు జిల్లాలోని మన్యం మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రారంభించింది. గిరిజన గూడేలలో ఇంటింటికీ వెళ్లి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ, జ్వరం ఉన్న వారికి తక్షణమే మందులు పంపిణీ చేస్తున్నారు. తాగునీటి వనరులలో క్లోరినేషన్ చేపట్టడంతో పాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాల రోగులను ఆసుపత్రులకు తరలించడానికి వీలుగా ఫీడర్ అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande