మోడీకి ఖర్గే లేఖ.. డీలిమేటేషన్పై 3 డిమాండ్లు
మోడీకి ఖర్గే లేఖ.. డీలిమేటేషన్పై 3 డిమాండ్లు
Kharge


న్యూఢిల్లీ, 27 ఆగస్టు (హి.స.)

దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే నియోజకవర్గాల పునర్విభజన వంటి సున్నితమైన అంశంపై ప్రభుత్వం ఏకపక్షంగా ముందడుగు వేయకూడదని ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీని విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్ బిల్లును బలవంతంగా తీసుకురావొద్దని నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. డీలిమిటేషన్ పై ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారనే చర్చ నేపథ్యంలో తాజాగా మోడీకి ఖర్గే లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు స్పష్టమైన డిమాండ్లను ప్రధాని ముందుంచారు.

ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్యను మార్చకుండా మరో 25 సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల వారీగా ఉన్న లోక్సభ స్థానాల ప్రాతినిధ్యంలో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుత సంఖ్యనే మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలన్నారు. రాబోయే 2029 లోక్సభఎన్నికల నాటికే చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావాలని ఖర్గే డిమాండ్ చేశారు. గతంలో ఏప్రిల్ 16, 17 తేదీల్లో చేసిన విధంగా బుల్డోజర్ తరహా నిర్ణయాలను మళ్లీ పునరావృతం చేయవద్దని హెచ్చరించారు. ఈ విషయంలో జులై 16, 2026న తాను రాసిన లేఖను కూడా ఖర్గే గుర్తు చేస్తూ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande