
హైదరాబాద్, 06 ఆగస్టు (హి.స.) దిల్లీ పార్టీల చేతిలో రాష్ట్రం మళ్లీ తల్లడిల్లుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాక కూడా సామంతుల్లా దిల్లీకి కప్పం కట్టే పరిస్థితి మళ్లీ వచ్చిందని విమర్శించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నీరు పుష్కలంగా ఉన్నా కాళేశ్వరం, పాలమూరు పంపులను సీఎం రేవంత్రెడ్డి ఆన్ చేయడం లేదని విమర్శించారు. నిధులు దిల్లీకి పంపడం తప్ప సీఎం చేస్తున్నది ఏమీ లేదని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్