ఏపీలో నేతలకు ప్రభుత్వం శుభవార్త
ఏపీలో నేతలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేతన్న భరోసా పెన్షన్ పథకం దరఖాస్తు ప్రక్రియలో కీలక నిబంధన నుంచి సీఎం చంద్రబాబు సర్కార్ మినహాయింపు ఇచ్చింది.
AP Govt


అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)

ఏపీలో నేతలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేతన్న భరోసా పెన్షన్ పథకం దరఖాస్తు ప్రక్రియలో కీలక నిబంధన నుంచి సీఎం చంద్రబాబు సర్కార్ మినహాయింపు ఇచ్చింది.

ఇకపై పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించాల్సిన అవసరం లేదని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. బ్యాంకు స్టేట్మెంట్కు బదులుగా మాస్టర్ వీవర్ ధ్రువీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.

దీని వల్ల అర్హత ఉన్న నేతన్నలు దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగనున్నాయని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ పెన్షన్లు అందిస్తామని మంత్రి సవిత వెల్లడించారు. అర్హత ఉన్న నేతన్నలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. నేతన్నల సంక్షేమం, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande