
ఆంధ్రప్రదేశ్ , 11 సెప్టెంబర్ (హి.స.)ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైళ్ల పరిష్కారంలో జాప్యంపై అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల మండిపడ్డారు. ఫోన్లు లేకుండా సమావేశానికి హాజరు కాలేరా అని సీఎం నిలదీశారు. ఫైళ్ల పరిష్కారానికి అధికారులు తీసుకుంటున్న సమయాన్ని వెల్లడించిన సీఎం, అధిక సమయం తీసుకుంటున్న వారిపై అసహనం వ్యక్తం చేశారు. శాఖాధిపతుల (HoDs) స్థాయిలో ఫైళ్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని సీఎం ప్రశ్నించారు.
బాధ్యులైన వారి నుంచి వివరణ కోరాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కలెక్టర్ల సమావేశానికి కొందరు అధికారులు గైర్హాజరు కావడంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరు కాకుండా ఉండేంత ధైర్యం వారికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్లు లేకుండా కూర్చోలేరా అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మండిపల్లి, పైలావుల, కొల్లు ఫైళ్ల పరిష్కారానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారని సీఎం పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్