తిరుమలలో 15 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిది రోజుల పాటు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
Vijayawada temple


ఆంధ్రప్రదేశ్ , 11 సెప్టెంబర్ (హి.స.)ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిది రోజుల పాటు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

అత్యంత వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల ముందస్తు క్రతువుల్లో భాగంగా సెప్టెంబరు 8న శ్రీవారి ఆలయంలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ (ఆలయ శుద్ధి) నిర్వహించారు. అనంతరం సెప్టెంబరు 14వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15న సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ‘ధ్వజారోహణం’ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande