
ఢిల్లీ , 14 సెప్టెంబర్ (హి.స.)కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బ్రిక్స్ సదస్సు వంటకాలపై స్పందించారు. భారత్లో 80 శాతం మంది నాన్- వెజిటేరియన్లేనని (మాంసాహారులు), భారతీయ నాన్- వెజిటేరియన్ వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయని ఆయన అన్నారు. భారత్ మండపంలో బ్రిక్స్ సదస్సుకు హాజరైన దేశాధినేతలు, ప్రతినిధుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ గాలా డిన్నర్లో పూర్తిగా శాకాహార వంటకాలే వడ్డించారు. దీనిపై రాహుల్ గాంధీ రోజు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
'80 శాతం మంది భారతీయులు నాన్ వెజిటేరియన్లు. భారతీయ నాన్ వెజ్ ఫుడ్ చాలా రుచికరంగా ఉంటుంది. అచ్చం నా సోదరి చేసే ఛోలే భటూరేలానే' అని వ్యాఖ్యానించారు. దీనితో పాటు డైనింగ్ టేబుల్పై ఉన్న ఛోలే భటూరే ఫొటోను కూడా రాహుల్ షేర్ చేశారు. ఛోలే భటూరే అంటే ఉత్తరాదిన మైదాతో చేసే పెద్ద పూరీ- శనగల కూర అని చెబుతుంటారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన నేతలు, ప్రతినిధులు భారత్కు వచ్చిన నేపథ్యంలో ఈ గాలా డిన్నర్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భారతీయ సంప్రదాయ వంటకాలను పరిచయం చేసేలా మెనూను రూపొందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్