తెల్లబంగారానికి పెరుగుతున్న డిమాండ్.. క్వింటాకు రూ.10 వేల పైనే
దేశంలో పత్తికి డిమాండు పెరుగుతోంది. దీంతో దాని ధర పెరుగుతోంది.
తెల్లబంగారానికి పెరుగుతున్న డిమాండ్.. క్వింటాకు రూ.10 వేల పైనే.. సామాన్యులకు షాక్..


ఆదోని, 18 సెప్టెంబర్ (హి.స.)దేశంలో పత్తికి డిమాండు పెరుగుతోంది. దీంతో దాని ధర పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధర ఏకంగా పదేళ్ల గరిష్టాన్ని తాకడం గమనార్హం. ఇక… ఈ ఏడాది కాటన్ ధర మరింత పెరిగే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.

పత్తి సాగు తక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దసరాకు ముందు కాటన్ సహా పలు బ్రాండ్ల దుస్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో టెక్స్టైల్ కంపెనీలకు ప్రయోజనం కలగనుంది. సామాన్యులపై భారం పెరుగనుంది.

కర్నూలు జిల్లాలోని ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర క్వింటాకు రూ. 9,600 నుంచి రూ. 10,000 పైగా పలకడంతో డిమాండ్ భారీగా పెరిగింది.

దాదాపు ఏడాది పొడవునా పత్తి క్రయవిక్రయాలు జరిగే ఆదోని మార్కెట్లో ప్రస్తుతం క్వింటాకు రూ.10వేలుపైనే లభిస్తోంది. తాజాగా క్వింటా పత్తి రూ.10,350 పలికింది. ఈ నెల ఒకటో తేదీన రూ.9,830 పలికిన ధర.. పది రోజుల్లో రూ.500దాకా పెరిగింది. మార్చి నెలలో కనీస మద్దతు ధర కూడా లేకపోగా.. ఇప్పుడు డిమాండ్ వచ్చింది. గతేడాది పత్తికి డిమాండ్ ఉన్నా.. ఉత్పత్తి లేకపోవడం, తుఫాన్ల వల్ల పంట దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande