
తెలంగాణ , 18 సెప్టెంబర్ (హి.స.)హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో రెసిడెంట్ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. విధుల్లో ఉన్న జూనియర్ వైద్యుడిని రోగి బంధువులు దూషించి, బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో వైద్యులు భద్రతా చర్యలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 18న కూడా ఓపీ, ఎలెక్టివ్ సేవలను బహిష్కరిస్తామని నిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే అత్యవసర విభాగం, క్యాజువాలిటీ సేవలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్