తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలకు 5.77 లక్షల దరఖాస్తులు
రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న తాజా నియామక ప్రక్రియలో మొత్తం 7,437 పోలీస్, అనుబంధ శాఖల పోస్టులకు 5,77,064 దరఖాస్తులు వచ్చాయి.
Telangana police


హైదరాబాద్ , 18 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న తాజా నియామక ప్రక్రియలో మొత్తం 7,437 పోలీస్, అనుబంధ శాఖల పోస్టులకు 5,77,064 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను సుమారు 4.29 లక్షల మంది అభ్యర్థులు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 16తో ముగిసింది. ఉద్యోగాల కోసం ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఉన్న పోటీకి మరో ఉదాహరణగా నిలిచింది. ఈ నియామకాల్లో సబ్ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టులతో పాటు కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో 298 ఎస్ఐ/ఏఎస్ఐ స్థాయి పోస్టులు, 7,139 కానిస్టేబుల్ స్థాయి పోస్టులు ఉన్నాయి. పోలీస్ శాఖతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్, జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ వంటి విభాగాల్లోనూ ఈ నియామకాలు జరగనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande