తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Rain


ఆంధ్రప్రదేశ్, 18 సెప్టెంబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో 19వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. అది దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల వైపు కదులుతుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని అంటున్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. హైదరాబాద్, మెదక్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, కామారెడ్డి, నాగర్కర్నూల్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు.

ఉత్తర థాయ్లాండ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సెప్టెంబర్ 19న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది బలపడి తీరం దాటే సమయంలో ఏపీలోని కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

ఇక, తెలంగాణలో నేటి నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు మెదక్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, కామారెడ్డి, నాగర్కర్నూల్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడే సూచన ఉంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande