తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
తిరుమల


తిరుమల, 18 సెప్టెంబర్ (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్ లేని భక్తలకు శ్రీవారి దర్శనానికి 15గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 68,262 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,959 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 25 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.

హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చింది. ఇక తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు నాలుగో రోజులో భాగంగా రాత్రి 7గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

మరియు, రేపు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. గరుడసేవకు ముందు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. భక్తుల భద్రతతో పాటు వాహనదారులకు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. నేడు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని, ట్రాఫిక్ మళ్లింపులను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande