అర్ధరాత్రి ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా.. 100 యుద్ధ విమానాలతో దాడులు
అర్ధరాత్రి ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా.. 100 యుద్ధ విమానాలతో దాడులు
l/america-iran-war-updates-582443


మిడిల్ ఈస్ట్ , 02 సెప్టెంబర్ (హి.స.)మిడిల్ ఈస్ట్ లో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్లో అమెరికా దళాలు విధ్వంసం సృష్టించాయి. లారక్ ద్వీపంపై వంద యుద్ధ విమానాలతో దాడులు చేసింది. అమెరికా ఇరాన్ పై చేపట్టిన ఆపరేషన్లలో ఇది అతిపెద్ద ఆపరేషన్గా తెలుస్తోంది. ఇరాన్ లోని అన్ని ఐఆర్ జీసీ స్థావరాలపై ఏక కాలంలో అమెరికా దాడులు చేసింది. ఖేష్, చబహార్, బందరాబస్, జాస్క్, జూస్క్, మినాబ్ సహా ఇతర ప్రాంతాలపై అర్ధరాత్రి నుండి అమెరికా దాడులకు పాల్పడుతోంది. అమెరికా చేసిన దాడుదలతో ఇరాన్ రాడార్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. సముద్ర మైన్లు అమర్చే ఇరాన్ ఆస్తులే లక్ష్యంగా అమెరికా ఈ దాడులకు పాల్పడింది. హోర్మూజ్లో అమెరికా వాణిజ్య నౌకలపై దాడులు, పశ్చిమాసియాలోని వివిధ అమెరికా స్థావరాలపై దాడులకు ప్రతిగా అగ్రరాజ్యం ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు ప్రకటించింది.

ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. యూఎస్ దళాలు దాడులు చేస్తుండటంతో ఇరాన్ ప్రతీకారంగా జోర్డాన్, బహ్రెయిన్లోని ఆ దేశ స్థావరాలపై దాడి చేసింది. అమెరికా చేసిన దాడులతో తమ దేశ పౌరులు మరణించినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. దక్షిణ ఇరాన్ లోని తీరప్రాంతమైన సిరిక్ సమీపంలో వివాహ వేడుక జరుగుతున్న ఓ ఇంటిపై అమెరికా జరిపిన దాడిలో ఐదుగురు మరణించినట్టు పేర్కొంది. మరో 65 మంది గాయపడ్డారని తెలిపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హోర్ముజ్ జలసంధిపై ప్రస్తుతం అమెరికాకు దాదాపు పూర్తి నియంత్రణ ఉందని పేర్కొన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్ప కూలుతోందని అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande