
న్యూఢిల్లీ, 26 సెప్టెంబర్ (హి.స.)
పిల్లల్లో మాదకద్రవ్యాల
వినియోగ వ్యసనాన్ని కేవలం సాధారణ ప్రజారోగ్య సమస్యగా మాత్రమే చూడకూడదని, దానిని అత్యంత ప్రధానమైన బాలల రక్షణ అంశంగా గుర్తించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
ఢిల్లీలోని బీహార్ లోక్ భవన్లో నిర్వహించిన పాటలీపుత్ర ప్రజ్ఞా ప్రవాహ్ కార్యక్రమంలో 'డ్రగ్స్కు ఆవల బాల్యం: రక్షణ, సంరక్షణ, పునరేకీకరణ' అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
భారతదేశంలో ప్రతి ఐదుగురు యుక్త వయస్కుల్లో కనీసం ఒకరు చిన్నప్పటి నుంచే మాదకద్రవ్యాల వ్యసన ప్రమాదంలో ఉన్నట్లు ప్రముఖ అంతర్జాతీయ వైద్య పత్రిక 'లాన్సెట్' ఇటీవలి అధ్యయనం వెల్లడించిన చేదు నిజాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..