విశాఖలో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై ఆహార భద్రత తనిఖీలు
విశాఖపట్నంలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వయించారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లలో నిబంధనలకు సంబంధించిన లోపాలను గుర్తించారు.
Food SAFETY


విశాఖపట్నం , 26 సెప్టెంబర్ (హి.స.)విశాఖపట్నంలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వయించారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లలో నిబంధనలకు సంబంధించిన లోపాలను గుర్తించారు.

బీచ్ రోడ్డులోని పిస్తా హౌస్, కామత్ హోటల్, జగదాంబ సెంటర్ సమీపంలోని ఆల్ఫా హోటల్, అక్కయ్యపాలెంలోని ఈస్టర్న్ స్పైస్ వంటి సంస్థలను అధికారులు తనిఖీ జరిపారు. ఆహార పదార్థాలను తయారు చేసే ప్రదేశాల పరిశుభ్రత, నిల్వ విధానం, వంటగదిలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు వంటి అంశాలను పరిశీలించారు.

తనిఖీల్లో గుర్తించిన లోపాలపై సంబంధిత సంస్థలకు నిబంధనల ప్రకారం చర్యలు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రతి సంస్థపై తీసుకునే తుది చర్యలు అధికారులు నిర్వహించే తదుపరి ప్రక్రియపై ఆధారపడి ఉంటాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande