
హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.)
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచే అనేక అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.
ఎన్నికల కమిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయని అన్నారు.
ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై తలెత్తుతున్న అనుమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..