ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..... ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కారు లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
Accident


ప్రకాశం , 26 సెప్టెంబర్ (హి.స.)ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కారు లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

మృతులను హరిప్రసాద్, విశాలాక్షిగా గుర్తించారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande