హైదరాబాద్ రెడ్హిల్స్లో గృహనిర్మాణ రంగంలో కీలక అడుగు: ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన
పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న రెడ్హిల్స్లో పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'ఇందిరమ్మ టవర్స్' నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులే
Indiramma towers


హైదరాబాద్ , 29 సెప్టెంబర్ (హి.స.)పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న రెడ్హిల్స్లో పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'ఇందిరమ్మ టవర్స్' నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారికంగా శంకుస్థాపన చేశారు. నాంపల్లి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న ఈ భారీ హౌసింగ్ ప్రాజెక్ట్ ద్వారా నగరంలోని అర్హులైన పేదలకు అత్యాధునిక వసతులతో కూడిన శాశ్వత ఇళ్లు అందనున్నాయి.

సుమారు రూ. 43.20 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్ట్ను అత్యంత ఆధునిక ప్రమాణాలతో నిర్మించనున్నారు. దీని ద్వారా మొత్తం 480 ఇందిరమ్మ ఫ్లాట్ల టవర్లు అందుబాటులోకి రానున్నాయి. మురికివాడల్లో, ఇరుకు గదుల్లో జీవనం సాగిస్తున్న నిరుపేదలకు పక్కా ఇళ్లను అందించడంతో పాటు, నగర పరిధిలో మౌలిక వసతులను మెరుగుపరచడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ టవర్ల నిర్మాణంతో హైదరాబాద్లో ప్రభుత్వ గృహనిర్మాణ రగంలో సరికొత్త అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande